Telupae Manasaa

May 7, 2020   

Stan 1:

నీ కన్నుల్లో చూశా నన్నే,

నా కలలే నీతో నిండేనే…

నీ నవ్వుల్లో దొరికే నా తీరమే,

నే అలనై నిన్నే చేరానే…


ఇదే తొలీ పరవశం,

నేనే ఇక నీ వశం,

ఆంక్ష వో కాంక్ష వో ఏమో…


తెలుపే మనసా, ఏదో ఈ వరస?

తెలుపే మనసా, ఏమైందో బహుశ?

Stan 2:

ఈ క్షణమీ వీక్షణమే అనుక్షణమూ కోరేనే,

వీక్షణకై నిరీక్షణలే క్షణమైన యుగమేలే…


ప్రతిదిశలో నువ్వున్నది మది తెలిపే సందేశమేలే,

నీ జతనే గెలవాలన్నది, ఆదేశమేలే…


ఇన్నళ్ళూ ఓవెలితేదో

ఈనాడే నను వీడేలా,

మాయేదో చెశావే…


తెలుపే మనసా, ఏదో ఈ వరస?

తెలుపే మనసా, ఏమైందో బహుశ?



comments powered by Disqus